- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర ప్రమాదం.. అతి వేగంతో ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
by Sridhar Babu |
<p>దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలోని చెరువుకట్టదగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక సీఐ కృష్ణారెడ్డి వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని చెరువుకట్ట వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న 13 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది […]</p>

X
దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలోని చెరువుకట్టదగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక సీఐ కృష్ణారెడ్డి వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని చెరువుకట్ట వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న 13 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారని, అందులో 13 మందికి గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ అజాగ్రత్త, అతివేగమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. ఈ బస్సు వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తుండగా జరిగింది.
Next Story






