తాళం వేసిన మూడు ఇళ్లలో చోరీలు

66

దిశ, వెబ్‌‌డెస్క్: తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నారు దుండగులు. తాజాగా మేడ్చల్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం అర్థరాత్రి రాఘవేంద్ర కాలనీలోని మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు దొంగలు. పలు ఇళ్లలో బంగారు ఆభరణాలు, డబ్బును ఎత్తుకెళ్లారు. యాజమానులు తిరుపతికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూడగా ఇంట్లోని సామాను చిందరవందరగా పడేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..