- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బోధన్‌లో దొంగల బీభత్సం
<p>దిశ, నిజామాబాద్: జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇంట్లోకి చొరబడి బీరువాలోని 10 తులాల బంగారం, వెండి, నగదును దోచుకెళ్లారు. ఈ ఘటన బోధన్ పట్టణంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక శక్కర్ నగర్‌లో నివాసముంటున్న లక్ష్మీకాంత్.. గత కొంతకాలం నుంచి తన ఇంటికి తాళం వేసి షర్బతి కెనాల్ రోడ్డులోని తన అన్న ఇంట్లోనే వారితోపాటే ఉంటున్నాడు. అప్పుడప్పుడు తన ఇంటిని చూసి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి లక్ష్మీకాంత్ నివాసానికి […]</p>

X
దిశ, నిజామాబాద్: జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇంట్లోకి చొరబడి బీరువాలోని 10 తులాల బంగారం, వెండి, నగదును దోచుకెళ్లారు. ఈ ఘటన బోధన్ పట్టణంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక శక్కర్ నగర్‌లో నివాసముంటున్న లక్ష్మీకాంత్.. గత కొంతకాలం నుంచి తన ఇంటికి తాళం వేసి షర్బతి కెనాల్ రోడ్డులోని తన అన్న ఇంట్లోనే వారితోపాటే ఉంటున్నాడు. అప్పుడప్పుడు తన ఇంటిని చూసి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి లక్ష్మీకాంత్ నివాసానికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు.. తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బంగారం, నగదు, వెండి దోచుకెళ్లారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Next Story






