దొంగతనానికి వెళ్లి… ఆమె బెడ్‌రూమ్‌లో రూటు మార్చి ట్విస్ట్ ఇచ్చాడు

by  |
దొంగతనానికి వెళ్లి… ఆమె బెడ్‌రూమ్‌లో రూటు మార్చి ట్విస్ట్ ఇచ్చాడు
X

దిశ, వెబ్ డెస్క్: ఓ దొంగ దొంగతనానికి వెళ్లి రూటు మార్చి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారి అందరికీ నవ్వులు పూయిస్తోంది. థాయ్‌లాండ్‌లోని ఫెట్చబూన్‌ ప్రావిన్స్‌కు చెందిన అతిట్‌ కిన్‌ కుంతుబ్‌ అనే 22 ఏళ్ల యువకుడు దొంగతనాలకు పాల్పడుతుంటాడు. ఈ నేపథ్యంలోనే ఓ రోజు దొంగతనం చేయడానికి స్థానికంగా ఉన్న ఓ ఆఫీసర్‌ ఇంటిని ఎంచుకున్నాడు. దొరికినకాడికి దోచుకుందామని పక్కా ప్లాన్ తో సదరు ఆఫీసర్ ఇంటికి చేరుకున్నాడు.

దొంగతనం చేద్దామని ఆఫీసర్ కూతురు బెడ్ రూమ్ లో దూరాడు. ఇక్కడే అతనికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆఫీసర్ కూతురు ఊరెళ్ళడంతో ఓసారి బెడ్ పైన పడుకుని దర్జాగా రిలాక్స్ అవుదామనుకున్నాడు. మనోడు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా దొంగతనాలు చేశాడో ఏమో పాపం. బెడ్ ఎక్కగానే నిద్ర ముంచుకొస్తుండటంతో ఓ కునుకేద్దామని ఫిక్స్ అయ్యాడు. అసలే ఏసీ గాలి చల్లగా తగులుతోంది, సుఖవంతమైన బెడ్ అయ్యేసరికి దొంగబాబుకి ఫుల్ గా నిద్ర పట్టేసింది. ఇంకేముంది తెల్లారిందాకా గుర్రుపెట్టి నిద్రపోయాడు.

ఉదయం కూతురు బెడ్ రూమ్ వైపు వచ్చిన ఆఫీసర్… తన కూతురే ఊరు నుండి తిరిగొచ్చిందనుకుని ముఖంపై ఉన్న దుప్పటి తొలగించి చూశాడు. కూతురి బెడ్ పై దొంగని చూసి అవాక్కయ్యాడు ఆ ఆఫీసర్. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పాపం దొంగ మాత్రం ఒక్క కునుకేసేలోపు ఇంత జరిగిందా అని షాక్ నుండి బయటపడేసరికి పోలీసులు అతనిని స్టేషన్ కి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.


Next Story

Most Viewed