క్రేజ్ ఉన్నా చాన్సులు లేని హీరోయిన్లు వీళ్లే..!

by  |
క్రేజ్ ఉన్నా చాన్సులు లేని హీరోయిన్లు వీళ్లే..!
X

దిశ, వెబ్‌డెస్క్ : సక్సెస్ లు ఉన్నంత వరకే సినిమా ఇండస్ట్రీలో ఛాన్సులు. సినిమా హిట్‌లో హీరోయిన్‌కి పెద్ద క్రెడిట్ ఇవ్వకపోయినా.. ఫ్లాప్‌లో మాత్రం ఫుల్ షేర్ ఇచ్చేస్తారు మేకర్స్. అందుకే పెద్ద లైఫ్ స్పాన్ లేని హీరోయిన్లు.. అలా వచ్చి ఇలా మాయం అయిపోతున్నారు. కానీ క్రేజ్ ఉన్న చాన్సులు లేని హీరోయిన్లు మాత్రం ఐటమ్ నంబర్స్, స్పెషల్ సాంగ్స్ తో మళ్లీ సిల్వర్ స్క్రీన్ మీద బిజీ అవుతున్నారు. అత్తారింటికి దారేది లాంటి కొన్ని సినిమాల్లో చేసిన ప్రణీత.. రవితేజ ఖిలాడీ సినిమాలో ఐటమ నంబర్ చేయబోతోందని, దాంతో టాలీవుడ్‌లో మళ్లీ బిజీ అవ్వడానికి ట్రై చేస్తోందని టాక్ నడుస్తోంది.

మరో క్రేజీ హీరోయిన్ రెజీనా కూడా ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేక మంచి సినిమాల కోసం వెయిట్ చేస్తోంది. ఒకటి, రెండు సినిమాలు చేస్తున్నా కూడా అవేం పెద్ద సినిమాలు కాదు. అందుకే మళ్లీ మంచి కమ్ బ్యాక్ కోసం క్రేజీ స్పెషల్ సాంగ్‌కి సై అంది రెజీనా. కొరటాల-చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో ఐటమ్ నంబర్ చేస్తోంది ఈ భామ.

ఆర్‌ఎక్స్ 100తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన పాయల్ రాజ్ పుత్.. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోతుందనుకున్నారు అందరూ. కానీ సరైన ఛాన్సు లేక చేసిన సినిమాల్నిఓటీటీల్లో రిలీజ్ చేసుకుంటోంది పాయల్. ఇప్పుడు మళ్లీ మంచి కమ్ బ్యాక్ కోసం ఆర్‌ఎక్స్ 100 డైరెక్టర్ సెకండ్ మూవీ మహాసముద్రంలో స్పెషల్ సాంగ్ చేయబోతోంది పాయల్ రాజ్‌పుత్. లైమ్ లైట్లోకి రావడానికి ఈజీ వే వెతుక్కుని ఇంతలా తంటాలు పడుతున్నారు హీరోయిన్లు.


Next Story