ఇప్పట్లో వేర్వేరు జట్ల ఆలోచన లేదు : ద్రవిడ్

by  |
ఇప్పట్లో వేర్వేరు జట్ల ఆలోచన లేదు : ద్రవిడ్
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్ ద్రవిడ్ తొలి సారిగా మీడియా ముందుకు వచ్చాడు. న్యూజీలాండ్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మతో కలసి పలు విషయాలు వెల్లడించాడు. ఇప్పట్లో వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు జట్లను తయారు చేసే ఆలోచన లేదని స్పష్టం చేశాడు. మాకు అన్ని ఫార్మాట్లు ముఖ్యమే కాబట్టి ఆటగాళ్ల మానసిక, శారీరిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సిద్ధం చేయాలని అనుకుంటున్నాము. అన్ని విభాగాలు బలోపేతం అయ్యేలా కృషి చేస్తాము. భవిష్యత్‌లో జరుగనున్న ఐసీసీ టోర్నీలను దృష్టిలో పెట్టుకునే మా సన్నాహాలు ఉండబోతున్నాయి. ప్రతీ ఆటగాడు ఫ్రెష్‌గా ఉండేలా చాలా ముఖ్యం. ప్రతీ ఒక్కరికి తగినంత విశ్రాంతి ఉండేలా చూస్తాము. అందరు ఆటగాళ్లు అన్ని ఫార్మాట్లలో రాణించడం కష్టం.. జట్టుకు తగ్గట్లుగా ఆటగాళ్లను తయారు చేస్తామని కోచ్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.

ఇక కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘జట్టులోని ప్రతీ ఒక్కరిపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉన్నది. టీ20 ప్రపంచ కప్‌కు మరో ఏడాదే సమయం ఉన్నది. అందుకే బౌలింగ్ చేసే నాణ్యమైన ఆల్‌రౌండర్‌ను వెతికే పనిలో పడ్డాము. క్లిష్టపరిస్థితుల్లో జట్టును ఆదుకునేలా ఆటగాళ్లు రాణించాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే విజయవంతమైన జట్టుగా మారుతాము’ అని అన్నాడు.


Next Story

Most Viewed