- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మౌళిక సదుపాయాల్లో లోపాలు ఉండకూడదు : కమిషనర్ అరుణ శ్రీ
దిశ, గోదావరిఖని : పారిశుధ్యం, నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ తదితర మౌళిక వసతుల నిర్వహణలో

దిశ, గోదావరిఖని : పారిశుధ్యం, నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ తదితర మౌళిక వసతుల నిర్వహణలో సేవా లోపాలు తలెత్తకుండా వార్డు అధికారులు సమర్దవంతంగా పర్యవేక్షణ చేయాలని అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) , రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ ఆన్నారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో మంగళ వారం వార్డు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ మున్సిపల్ సేవల అమలు తీరుపై చర్చించారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణలో ప్రవేశ పెట్టిన రెండు పూటలా పని చేసే విధానాన్ని, సిబ్బంది హాజరును, చెత్త సేకరణ, డీఆర్సీ కేంద్రానికి పొడి చెత్త , కంపోస్ట్ యార్డు కు పొడి చెత్త వెళ్ళేలా పర్యవేక్షించాలని అన్నారు. నీటి సరఫరాకు సంబందించి నిర్ణీత సమయానికి విడుదల చేయడం, లీకేజీ లు వెంటనే అరికట్టడం, కనీసం ప్రతి 15 రోజులకు ఒక సారి ట్యాంకు శుభ్రం చేయడం వంటి పనులు కూడా పర్యవేక్షించాలన్నారు.
నీటి శుద్దత కు సంబందించి పరీక్ష నిర్వహించే విధానం పై అమృత్ మిత్రలకు, వార్డు అధికారులకు అవగాహన కల్పించాలని అన్నారు. నగరంలో అన్ని వీధి దీపాలు వెలిగేలా చూడడంతో పాటు కొత్తగా వేసిన స్తంభాలకు లైట్లు వెలిగించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. నగర పాలక సంస్థ నిర్వహణకు ప్రధాన వనరు అయిన ఆస్తి పన్ను, నల్లా బిల్లులే లక్ష్యం ప్రకారం వసూలు చేయాలని అన్నారు. ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. జల శక్తి అభియాన్ కింద ఇంకుడు గుంతల ఫోటోలు ఆన్ లైన్ లో, నల్లా వినియోగదారుల వివరాలు అమృతమ్ యాప్ లో అప్ లోడ్ చేయాలని అన్నారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్ , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్ , సెక్రెటరీ ఉమా మహేశ్వర్ రావు , అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు , ఆర్ ఓ ఆంజనేయులు సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ పాల్గొన్నారు.






