భారత్‌లో కరోనా విజృంభణ… కొత్తగా ఎన్నంటే?

8

దిశ, వెబ్‌డెస్క్: భారత్ కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. ఎంత కట్టడి చేసినా.. ఏమాత్రం తగ్గుముఖం పట్టకుండా విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 85,362, పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా 1,089 మంది మహమ్మారి బారిన పడి మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 59,03,933కు చేరాయి. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 93,379 మంది మరణించారు. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 9,60,969గా ఉన్నాయి. మహమ్మారి బారి నుంచి సంపూర్ణ ఆరోగ్యంగా 48,49,585 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.