- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొగడ్తలను తలకెక్కించుకోను.. విమర్శలను పట్టించుకోనంటూ ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నిధి అగర్వాల్
నేను ఎప్పుడూ పొగడ్తలను తలకెక్కించుకోను, అలాగే విమర్శలను అస్సలు పట్టించుకోను.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్‌కు గత కొద్ది కాలంగా అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు. ఎంత కష్టపడినప్పటికీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదు. ఇటీవల చేసిన హరి హరి వీరమల్లు, ది రాజా సాబ్ రెండు భారీ అంచనాలు మధ్య విడుదలై ఆశించనంత స్థాయిలో హిట్ అందుకోలేకపోయాయి. నిధి కష్టపడినప్పటికీ శ్రమ అంతా వృధా అయిపోయింది. దీంతో గత కొద్ది కాలంగా నిధిపై విమర్శలు వస్తున్నాయి. కష్టపడినప్పటికీ ఇండస్ట్రీలో రాణించాలంటూ అదృష్టం కూడా ఉండాలని నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ కూడా చేస్తున్నారు. తాజాగా, తనపై వస్తున్న విమర్శలపై నిధి అగర్వాల్ స్పందిస్తూ.. "నేను ఎప్పుడూ పొగడ్తలను తలకెక్కించుకోను, అలాగే విమర్శలను అస్సలు పట్టించుకోను. ఇండస్ట్రీలో ఒక సక్సెస్‌ఫుల్ నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని అందరికీ ఉంటుంది, దానికి నేనేమీ మినహాయింపు కాదు.
కానీ, ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఒక సినిమా సక్సెస్ అనేది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. నేను నటించిన చిత్రాలు కొన్ని హిట్టయ్యాయి, అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఒకవేళ సినిమా ఆడకపోతే దానికి గల కారణాలను తెలుసుకుని, నన్ను నేను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాను" అని చెప్పింది. తనను అదృష్టం లేని నటిగా విమర్శిస్తున్న వారికి సమాధానమిస్తూ.. తాను అదృష్టం కంటే కేవలం తన టాలెంట్‌ను మాత్రమే నమ్ముకుంటానని నిధి స్పష్టం చేసింది. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా నటిగా తన వంద శాతం శ్రమను ఎప్పుడూ పెడుతూనే ఉంటానని తెలిపింది. నిధి చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఎన్ని పరాజయాలు ఎదురైనా కుంగిపోకుండా, తన టాలెంట్‌పై నమ్మకంతో ఉన్న నిధిని అభిమానులు అభినందిస్తున్నారు.






