- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజల వద్దకే పాలన: 600 కుటుంబాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం..!
అద్దంకి ఆర్డీవో కార్యాలయ ఆవరణ(Addanki RDO office premises)లో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు ఆధ్వర్యంలో "మీ కోసం - ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవి(Minister Gottipati Ravi) పాల్గొన్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో దశాబ్దాలుగా నలిగిపోతున్న ఒక ప్రధాన భూ సమస్యకు ఆయన ముగింపు పలికారు

దిశ, వెబ్ డెస్క్: అద్దంకి ఆర్డీవో కార్యాలయ ఆవరణ(Addanki RDO office premises)లో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు ఆధ్వర్యంలో "మీ కోసం - ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవి(Minister Gottipati Ravi) పాల్గొన్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో దశాబ్దాలుగా నలిగిపోతున్న ఒక ప్రధాన భూ సమస్యకు ఆయన ముగింపు పలికారు. దాదాపు 600 కుటుంబాలకు చెందిన భూములను 22A నిషేధిత జాబితా నుండి తొలగిస్తూ, ఆయా భూములపై సదరు రైతులకు, యజమానులకు సంపూర్ణ హక్కులు కల్పించే అధికారిక ఆర్డర్ కాపీలను కలెక్టర్‌తో కలిసి లబ్ధిదారులకు మంత్రి గొట్టిపాటి రవి అందజేశారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రత్యేక రెవెన్యూ డివిజన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని గొట్టిపాటి రావి స్పష్టం చేశారు.
గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
ఆర్డర్ కాపీల పంపిణీ అనంతరం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవి పాల్గొన్నారు. ప్రజల నుంచి నేరుగా వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిబంధనల ప్రకారం వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు తమ చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా, జిల్లా యంత్రాంగమే స్వయంగా నేరుగా ప్రజల వద్దకు వచ్చి సేవలు అందించేలా సరికొత్త పాలనా విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.
బలమైన వారధిగా పని చేయాలి
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అధికారులు ఒక బలమైన వారధిగా పని చేయాలని, కార్యాలయాలకు వచ్చే అర్జీలపై సానుకూలంగా స్పందిస్తూ ప్రజా సమస్యలు మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాలు చూపాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి సూచించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం, "మీ కోసం" వంటి వినూత్న ప్రజావేదిక కార్యక్రమాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవి పేర్కొన్నారు.






