- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాత సామాన్ల కొంటామని…గొలుసు లాక్కెళ్లాడు…
<p>దిశ వెబ్ డెస్క్: పాత సామాన్లను కొంటామని వచ్చి మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లాడో దొంగ. ఈ ఘటన గన్నవరం మండలం కేసరపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లో కెళితే…పద్మావతి అనే మహిళ తన కుంటుంబం తో సహా కేసరపల్లిలో నివాసం ఉంటోంది. పాత సామాన్లను కొంటామని శుక్రవారం మధ్యాహ్నం ఓ దొంగ వచ్చాడు. పాత సామాన్లు ఏమైనా ఉన్నాయా అని పద్మావతిని అడిగాడు. దానికి లేదని ఆమె బదులిచ్చింది. ఇంతలో ఆమె ఇంట్లో పిల్లి పిల్లలను […]</p>

X
దిశ వెబ్ డెస్క్:
పాత సామాన్లను కొంటామని వచ్చి మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లాడో దొంగ. ఈ ఘటన గన్నవరం మండలం కేసరపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లో కెళితే…పద్మావతి అనే మహిళ తన కుంటుంబం తో సహా కేసరపల్లిలో నివాసం ఉంటోంది. పాత సామాన్లను కొంటామని శుక్రవారం మధ్యాహ్నం ఓ దొంగ వచ్చాడు. పాత సామాన్లు ఏమైనా ఉన్నాయా అని పద్మావతిని అడిగాడు. దానికి లేదని ఆమె బదులిచ్చింది. ఇంతలో ఆమె ఇంట్లో పిల్లి పిల్లలను దొంగ చూశాడు. పెంచుకోవడానికి పిల్లి పిల్లలను ఇస్తారా అంటూ ఆమెను అడిగాడు. దీంతో ఆమె సరే అని చెపింది. పిల్లిపిల్లలను తీసుకొని అతని ఇవ్వబోయింది. దీంతో ఆమె మెడలో ఆరు తులాల బంగారు గొలుసును లాక్కొని దొంగ బైక్ పై పరారయ్యాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Next Story






