టీంవర్క్‌‌తో నిమిషాల్లో వస్తువులు మాయం.. భద్రం అంటున్న పోలీసులు..

by Batti.Sumithra |   (  Updated:2021-12-17 05:49:00  IST  )

<p>దిశ, సదాశివపేట: గతంలో దొంగతనాలు ఎక్కువగా రాత్రిళ్ళు జరిగేవి. కానీ ప్రస్తుతం దొంగలు పట్ట పగలే ఫోన్లు, చీరలు, విలువైన వస్తువులను దొంగిలిస్తున్నారు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివపేట పట్టణం దొంగతనాలకు అడ్డాగా మారిందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దొంగలు కొంతమంది కలిసి టీం వర్క్‌గా పని చేస్తూ ప్రజల దృష్టిని మరల్చి నిముషాల్లో దొంగతనం చేసి పరారవుతున్నారు. సదాశివపేట పట్టణంలో బుధవారం, ఆదివారం రోజున సంతలో ఎక్కువగా ఫోన్లు, నగదు చోరి జరుగుతుందన్నారు. మండలంలోని [&hellip;]</p>

thefts
X

దిశ, సదాశివపేట: గతంలో దొంగతనాలు ఎక్కువగా రాత్రిళ్ళు జరిగేవి. కానీ ప్రస్తుతం దొంగలు పట్ట పగలే ఫోన్లు, చీరలు, విలువైన వస్తువులను దొంగిలిస్తున్నారు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివపేట పట్టణం దొంగతనాలకు అడ్డాగా మారిందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దొంగలు కొంతమంది కలిసి టీం వర్క్‌గా పని చేస్తూ ప్రజల దృష్టిని మరల్చి నిముషాల్లో దొంగతనం చేసి పరారవుతున్నారు. సదాశివపేట పట్టణంలో బుధవారం, ఆదివారం రోజున సంతలో ఎక్కువగా ఫోన్లు, నగదు చోరి జరుగుతుందన్నారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ సంతకు వస్తారు. ప్రతి వారం జరిగే ఈ సంతలో కనీసం 2 నుంచి 10 వరుకు సెల్ ఫోన్‌లు చోరీకి గురవుతున్నాయి.

ఇటీవల బుధవారం మార్కెట్‌లో ఒక మహారాష్ట్ర వ్యక్తి సెల్ ఫోన్ దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడగా ఆ దొంగను పోలీస్ స్టేషన్ కు తరలించారు. పట్టణ పరిధిలోని గాంధీ చౌక్ వద్ద శ్రీ రేణుక సారీ సెంటర్ లో గురువారం ఒక మహిళ ఏకంగా 5 చీరలు దొంగతనం చేసింది. ఇలా పట్టణంలో వరుస దొంగతనాలు జరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులు గస్తీ చేపడుతున్న దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. ఈ విషయమై సదాశివపేట పట్టణ సీఐ గూడూరి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ఎక్కడైనా దొంగతనాలు, పేకాట స్థావరాలు, అనుమానితుల వివరాలు తమకు తెలియపరచాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు.

Next Story