- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుడిలో దొంగతనం.. పూజారిపైనే అనుమానం
<p>దిశ, బెల్లంపల్లి: బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. హుండీ దొంగతనం జరగడం ఇది నాలుగోసారి. ఇటీవల కార్తీక పౌర్ణమి నేపథ్యంలో హుండీ లెక్కించాలి అని ఆలయ పాలక వర్గం అనుకున్న సమయంలో దొంగతనం జరగడం అనుమానాలకు దారి తీస్తోంది. ముఖ్యంగా పూజారి పాత్ర పైనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూజారి వేణుగోపాల్ శర్మ రాత్రి వేళల్లో గుడిలో ప్రేమ వివాహాలు చేసి.. […]</p>

దిశ, బెల్లంపల్లి: బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. హుండీ దొంగతనం జరగడం ఇది నాలుగోసారి. ఇటీవల కార్తీక పౌర్ణమి నేపథ్యంలో హుండీ లెక్కించాలి అని ఆలయ పాలక వర్గం అనుకున్న సమయంలో దొంగతనం జరగడం అనుమానాలకు దారి తీస్తోంది. ముఖ్యంగా పూజారి పాత్ర పైనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూజారి వేణుగోపాల్ శర్మ రాత్రి వేళల్లో గుడిలో ప్రేమ వివాహాలు చేసి.. వేలల్లో డబ్బులు తీసుకుంటున్నారని భక్తులు చెబుతున్నారు. ఇక ధృవీకరణ పత్రం ఇచ్చేందుకు రూ. 5 నుంచి రూ. 10 వేలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో మూడుసార్లు దొంగతనం జరిగినప్పటికీ దేవాదాయ శాఖ అధికారులు కేవలం పోలీసులకు ఫిర్యాదు చేయడం, సంబంధిత అధికారులు సైతం నామమాత్రంగా విచారణ జరపడం పరిపాటిగా మారడం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీటీసీ మహేందర్ మంగళవారం గురిజాల పోలీసులకు ఫిర్యాదు చేయడం చేశారు.






