- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైరాలో భారీ చోరీ
by Sridhar Babu |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ బంగారం షాపులోని వెండి వస్తువులు, బంగారం దోచుకెళ్లారు. ఈ ఘటన వైరా పట్టణంలో బాలాజీ జ్యూయలరీ షాపులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… షాపు ముందున్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, షాపు షట్టర్‌ను పగలగొట్టి లోపలికి ప్రవేశించి 20 కిలోల వెండి, 6 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. అయితే దొంగలు షాపులోని సీసీ కెమెరాలను గమనించకపోవడంతో రికార్డు అయిన దృశ్యాల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ బంగారం షాపులోని వెండి వస్తువులు, బంగారం దోచుకెళ్లారు. ఈ ఘటన వైరా పట్టణంలో బాలాజీ జ్యూయలరీ షాపులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… షాపు ముందున్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, షాపు షట్టర్‌ను పగలగొట్టి లోపలికి ప్రవేశించి 20 కిలోల వెండి, 6 తులాల బంగారం ఎత్తుకెళ్లారు.
అయితే దొంగలు షాపులోని సీసీ కెమెరాలను గమనించకపోవడంతో రికార్డు అయిన దృశ్యాల ప్రకారం ఇద్దరు దొంగలు దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు రూ. 12 లక్షల విలువైన వస్తువులను ఎత్తుకెళ్లినట్లు బాధితుడు వెల్లడించాడు. వైరా ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్ షాపును సందర్శించి, త్వరగా కేసును చేదించాలని పోలీసులను ఆదేశించారు.
Next Story






