- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇదెక్కడి విచిత్రం బాబోయ్.. పోలీస్ స్టేషన్ లోనూ దొంగలు పడ్డారు
<p>దిశ,వెబ్ డెస్క్:సాధారణంగా ఏ ఇంట్లోనైనా దొంగతనం జరిగితే పోలీస్ స్టేషన్ కి వెళ్తాము. అదే పోలీస్ స్టేషన్ లోనే దొంగతనం జరిగితే… అందరిని షాక్ కి గురిచేసిన ఈ విచిత్ర సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే గత నాలుగు రోజుల నుండి బ్యాంకు సెలవులు కావడంతో వైన్ షాప్ లకు సంబంధించిన రూ.8 లక్షల నగదును పోలీస్ లాకర్ లో భద్రపరిచారు. ఇక నేడు బ్యాంకులు ఓపెన్ […]</p>

X
దిశ,వెబ్ డెస్క్:సాధారణంగా ఏ ఇంట్లోనైనా దొంగతనం జరిగితే పోలీస్ స్టేషన్ కి వెళ్తాము. అదే పోలీస్ స్టేషన్ లోనే దొంగతనం జరిగితే… అందరిని షాక్ కి గురిచేసిన ఈ విచిత్ర సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే గత నాలుగు రోజుల నుండి బ్యాంకు సెలవులు కావడంతో వైన్ షాప్ లకు సంబంధించిన రూ.8 లక్షల నగదును పోలీస్ లాకర్ లో భద్రపరిచారు. ఇక నేడు బ్యాంకులు ఓపెన్ కావడంతో నగదును డిపాజిట్ చేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు లాకర్ ఓపెన్ చేసి డబ్బు తీద్దామనుకున్న పోలీసులకు భారీ షాక్ తగిలింది. లాకర్ లో భద్రపరిచిన మొత్తం డబ్బు మాయమై కనిపించింది. లాకర్ లో పెట్టిన నగదు కనిపించకపోయేసరికి ఖంగు తిన్న పోలీసులు వెంటనే దొంగతనం జరిగిందని గ్రహించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Next Story






