కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి ఇంట్లో చోరీ

6

దిశ, వెబ్‎డెస్క్:

కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఇంట్లో చోరీ జరిగింది. రూ.3.5 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.3లక్షల నగదు చోరీ అయినట్లు రేణుకా చౌదరి తెలిపారు. ఈ మేరకు మంగళవారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో పనిచేసే ముగ్గురు వ్యక్తులను అనుమానిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇంట్లో పని చేసేవాళ్లే దొంగతనానికి పాల్పడ్డారా..? లేదా బయట వ్యక్తుల పనా..? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.