అబ్బా.. కంపౌండర్ ఎంత పని చేసిండు..!!

168
grocery store

దిశ, వెబ్‌డెస్క్ : శనివారం రాత్రి 11 గంటలు దాటుతోంది. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు పల్సర్ బైక్‌పై వచ్చి ఓ కిరాణం దుకాణం ముందు ఆగారు. చుట్టు గమనించి.. షాపు ముందుకు వెళ్లారు. షటర్ వేసి ఉండడంతో ఓ వ్యక్తి తాళం పగలకొడుతుండగా.. మరో వ్యక్తి కాపలగా ఉన్నాడు. నిమిషాల్లో షటర్ ఎత్తుకుని లోపలికి వెళ్లి కాగల కార్యం చేశాడో వ్యక్తి. ఇదంతా ఎదురుగా ఉన్న హాస్పిటల్‌లోని కంపౌండర్ గమనించాడు. ఇంకేముంది.. పోలీసుల రంగ ప్రవేశంతో ఆ ఇద్దరి పన్నాగం బెడిసి కొట్టింది.

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం హుజూర్ నగర్ రోడ్డులోని కిరాణం షాపులో శనివారం రాత్రి దొంగతనం జరిగింది. దుకాణ యజమాని సత్యవతి షాప్ మూసేసి వెళ్లింది. రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు పల్సర్ బైక్‌పై వచ్చి చోరీకి పాల్పడుతుండగా.. ఎదురుగా ఉన్న ఆస్పత్రి కంపౌండర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అప్రమత్తమైన పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.

కాగా, పోలీసులను చూసి బయట కాపలాగా ఉన్న యువకుడు పరారు కాగా, దుకాణంలో చొరబడిన రవీంద్ర చారి అనే యువకుడు పోలీసులకు పట్టబడ్డాడు. పరారీ అయిన నిందితుడి వద్ద రూ.10 వేల విలువైన సిగరేట్ బాక్సులు, రూ.5 వేల నగదు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. తప్పించున్న నిందితుడిని కూడా వెంటనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. షాప్ నిర్వహకురాలు సత్యవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..