అన్నను కొట్టి చంపిన తమ్ముడు

by  |
అన్నను కొట్టి చంపిన తమ్ముడు
X

దిశ, మంగపేట: మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ కుటుంబంలో విషాదం నింపింది. ఈ ఘటన ములుగు జిల్లా మంగపేట మండలం బాలన్నగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. నరేందర్‌రావుపేటకు చెందిన కల్తీ నవీన్, కల్తీ నాగబాబు అన్నదమ్ములు శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో మద్యం మత్తులో ఘర్షణ పడ్డారు. ఆ గొడవలో అన్న నవీన్ తమ్ముడు నాగబాబును కొట్టడంతో గొడవ తీవ్రస్థాయికి చేరింది. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన నాగబాబు అన్న నవీన్ తలపై కర్రతో బలంగా కొట్టడంతో నవీన్ అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిని గమనించిన స్థానికులు నాగబాబును చెట్టుకు కట్టేసి, పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed