న్యూడ్ కాల్ కావాలని కోరిన యువతి.. బాత్రూంకు వెళ్లిన యువకుడు..

by  |
న్యూడ్ కాల్ కావాలని కోరిన యువతి.. బాత్రూంకు వెళ్లిన యువకుడు..
X

దిశ, క్రైమ్ బ్యూరో : ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ యువతి, వాట్సాప్‌లో న్యూడ్ కాల్ చేయడంతో రూ.10 లక్షలకు మోసపోయాడు. చివరకు సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వివరాల ప్రకారం.. నగరంలోని బేగంబజార్‌కు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి ఓ యువతి ఫేస్ బుక్‌లో పరిచయమైంది. వాట్సాప్ కాల్ చేస్తానంటూ ఫోన్ నెంబరు తీసుకుంది.

వాట్సాప్ కాల్ చేసిన తర్వాత న్యూడ్ కాల్ చేస్తానంటూ చెప్పడంతో అందుకు అంగీకరించాడు. ఆ తర్వాత నువ్వు కూడా న్యూడ్ కావాలంటూ కోరడంతో.. బాత్రూంకు వెళ్లి న్యూడ్ అయ్యాడు. దీంతో న్యూడ్ కాల్‌ను రికార్డు చేసిన సదరు లేడీ యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేశానంటూ.. దీనిని డిలీట్ చేయాలంటే రూ.10 లక్షలు కావాలంటూ డిమాండ్ చేసింది.

లేదంటే, ఫేస్ బుక్ లోని మీ స్నేహితులకు పంపిస్తానంటూ బెదిరించింది. అనుకున్నట్టుగానే కొందరు ఫ్రెండ్స్ కు పంపింది. దీంతో చేసేదేమీ లేక, రూ.10 లక్షలను సమర్పించుకున్నాడు. సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీసీఎస్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.

Next Story