వేధింపులు తాళలేక వాలంటీర్ ఆత్మహత్య

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్ : ఆకతాయి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. గత కొద్ది కాలంగా పవన్ అనే యువకుడు వాలంటీర్ గా పనిచేస్తున్న స్వాతిని ప్రేమించాలని వెంటపడుతున్నాడు. అయితే తన జోలికి రావద్దని స్వాతి చాలా సార్లు అతడిని హెచ్చరించింది. అయినా అతను వెంటపడ్డాడు. ఆ వేధింపులు తాళలేక స్వాతి బీపీ మాత్రలు మింగింది. అది గమనించిన కుటుంబ [&hellip;]</p>

వేధింపులు తాళలేక వాలంటీర్ ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్ : ఆకతాయి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. గత కొద్ది కాలంగా పవన్ అనే యువకుడు వాలంటీర్ గా పనిచేస్తున్న స్వాతిని ప్రేమించాలని వెంటపడుతున్నాడు. అయితే తన జోలికి రావద్దని స్వాతి చాలా సార్లు అతడిని హెచ్చరించింది. అయినా అతను వెంటపడ్డాడు. ఆ వేధింపులు తాళలేక స్వాతి బీపీ మాత్రలు మింగింది. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. స్వాతి చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతిచెందింది. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన స్వాతి బంధువులు పవన్ ను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకు దిగారు.

Next Story