పాముకు ‘ఊపిరి’చ్చిన యువకుడు

by  |
పాముకు ‘ఊపిరి’చ్చిన యువకుడు
X

దిశ,వెబ్‌డెస్క్ : ఓ యువకుడు చేసిన సాహసం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఇంతకు అతను చేసిన సాహసం ఏంటీ అనుకుంటున్నారా.. ఏవరైనా పామును చూస్తేనే ఆమడ దూరం పారిపోతారు. ఇక పాము కలలో కనిపిస్తేనే వణికి పోయేవారు ఉన్నారు. కానీ పాముకు ప్రాణం పోసేవారు ఉన్నారా.. అంటే ఉన్నారనే చెప్పాలనిపిస్తుంది ఈ యువకుడిని చూస్తే. ఒడిశాలో మ‌ల్కన్ గిరి జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

ఓ యువకుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో అతనికి అపస్మారక స్థితిలో ఉన్న ఓ పాము కనిపించింది. దీంతో అతను ఏలాగైన దాని ప్రాణాలు కాపాడాలి అనుకున్నాడు. దానికోసం ఓ స్ట్రాతీసుకొని పాము నోటిలో పెట్టి ఊదడం మొదలు పెట్టాడు. అలా ఆ పాముకు ఊపిరి అందించాడు. కొద్ది సేపటికి పాములో చలనం వచ్చింది. దీంతో ఇంత పెద్ద సాహసం చేసిన అతన్ని అందరూ తెగ మెచ్చుకో సాగారు. ఓ విషపురుగు, అది ప్రాణాలను తీస్తుంది అని తెలిసి కూడా ప్రాణాలను లెక్క చేయకుండా పాముకు ఊపిరి పోసిన ఆ యువకున్ని అందరూ అభినందించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed