- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబులెన్స్ నుంచి దూకిన క్షతగాత్రుడు
<p>దిశ, మహబూబాబాద్: బైక్ మీద నుండి పడి తీవ్ర గాయాలైన యువకుడి ని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ఆ వ్యక్తి అంబులెన్స్ అద్దాలు పగలగొట్టి,108 సిబ్బంది పై దాడి చేసిన సంఘటన జిల్లా లోని బయ్యారం మండలం సత్యనారాయణపురం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పరకాల మండలం కు చెందిన శివ అనే వ్యక్తి మద్యం మత్తులో బయ్యారం మండలం సత్యనారాయణ పురం వెళ్తున్నాడు. ఆ సమయంలో అతనికి ఎదురు వస్తున్న ద్విచక్రవాహనం […]</p>

దిశ, మహబూబాబాద్: బైక్ మీద నుండి పడి తీవ్ర గాయాలైన యువకుడి ని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ఆ వ్యక్తి అంబులెన్స్ అద్దాలు పగలగొట్టి,108 సిబ్బంది పై దాడి చేసిన సంఘటన జిల్లా లోని బయ్యారం మండలం సత్యనారాయణపురం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. పరకాల మండలం కు చెందిన శివ అనే వ్యక్తి మద్యం మత్తులో బయ్యారం మండలం సత్యనారాయణ పురం వెళ్తున్నాడు. ఆ సమయంలో అతనికి ఎదురు వస్తున్న ద్విచక్రవాహనం ను తప్పించబోయి అదుపుతప్పి కిందపడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలతో కొట్టమిట్టాడుతున్న శివ ను చూసి స్థానికులు పోలీసుల కు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ అతని 108 ద్వారా మహబూబాబాద్ ఏరియా హస్పటల్ కి తరలించారు. అయితే తరలించే సమయంలో ఆ యువకుడు అంబులెన్స్ సిబ్బంది పై దాడి చేసి, 108 వాహనం అద్దాలును పగల గొట్టి పరారయ్యాడు. కాగా అంబులెన్స్ సిబ్బంది మహబూబాబాద్ టౌన్ పోలీసులు ఫిర్యాదు చేశారు.






