- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉదయాన్నే చేపల వేటకు వెళ్లిన యువకుడు.. చివరకు
by Shyam |
<p>దిశ, దుబ్బాక : సిద్దిపేట జిల్లా తొగుట మండలం లింగాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొంగరి భాస్కర్ (25) అనే యువ మత్స్యకారుడు శుక్రవారం ఉదయం చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే కుటుంబీకులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. గ్రామస్తుల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. […]</p>

X
దిశ, దుబ్బాక : సిద్దిపేట జిల్లా తొగుట మండలం లింగాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొంగరి భాస్కర్ (25) అనే యువ మత్స్యకారుడు శుక్రవారం ఉదయం చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే కుటుంబీకులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. గ్రామస్తుల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉదయం ఇంట్లో నుంచి వెళ్లి చేపలు పట్టే క్రమంలో కాళ్లకు చేపల వల చుట్టుకొని మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన కొంగరి భాస్కర్ మృతి చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి నెలకొందని, వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Next Story






