- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేపల వేటకు వెళ్లి.. యువకుడు గల్లంతు
<p>దిశ, సిద్దిపేట: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు గల్లంతైన ఘటన సిద్దిపేట జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన బండి వెంకటేశం అనే యువకుడు తన ముగ్గురి స్నేహితులతో కలిసి చిన్నకొడూర్ మండలం మాటిండ్ల గ్రామ చెరువులో చేపల వేటకు వెళ్లారు. వెంకటేశం చేపల వలతో బ్రిడ్జి పక్కన ఉన్న కాలువ వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు కాలు జారీ పడిపోయాడు. కాలువ ఉధృతంగా […]</p>

దిశ, సిద్దిపేట: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు గల్లంతైన ఘటన సిద్దిపేట జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన బండి వెంకటేశం అనే యువకుడు తన ముగ్గురి స్నేహితులతో కలిసి చిన్నకొడూర్ మండలం మాటిండ్ల గ్రామ చెరువులో చేపల వేటకు వెళ్లారు. వెంకటేశం చేపల వలతో బ్రిడ్జి పక్కన ఉన్న కాలువ వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు కాలు జారీ పడిపోయాడు.
కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వెంకటేశ్ సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు కొట్టుకొని పోయినట్టు తెలిపారు. అతని మిత్రులు పోలీసులకు సమాచారం అందించడంతో, వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. వెంకటేష్‌కు ఒక కుమారుడు, భార్య గర్భవతిగా ఉంది. చీకటి పడే వరకు పోలీసులు గాలించినా అతని ఆచూకీ లభించలేదు. అతని కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి.






