- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్నేహితుల కళ్ల ముందే కరెంట్ షాక్‌తో యువకుడు మృతి.. నిమజ్జనంలో విషాద ఘటన.. వీడియో
<p>దిశ, హన్మకొండ చౌరస్తా : ఎంతో సంబరంగా గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తుండగా విషాద ఘటన చోటు చేసుకుంది. స్నేహితుల కళ్ల ముందే ఓ యువకుడు కరెంట్ షాక్‌కు బలైన ఘటన హన్మకొండలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. హన్మకొండలోని కొత్తూరు జెండా కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన గణేషుడి నిమజ్జనం కోసం సాయి అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నాడు. అంతేకాకుండా వర్షం కూడా పడుతుండడంతో గణేష్ మండపం ఆవరణ మొత్తం తడిగా […]</p>

X
దిశ, హన్మకొండ చౌరస్తా : ఎంతో సంబరంగా గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తుండగా విషాద ఘటన చోటు చేసుకుంది. స్నేహితుల కళ్ల ముందే ఓ యువకుడు కరెంట్ షాక్‌కు బలైన ఘటన హన్మకొండలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. హన్మకొండలోని కొత్తూరు జెండా కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన గణేషుడి నిమజ్జనం కోసం సాయి అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నాడు. అంతేకాకుండా వర్షం కూడా పడుతుండడంతో గణేష్ మండపం ఆవరణ మొత్తం తడిగా ఉంది.
ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి కరెంట్ షాక్ తగలడంతో సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటివరకు తమతో కలిసి ఏర్పాట్లు చేస్తున్న మిత్రుడు కానరాని లోకాలకు పోవడంతో స్నేహితులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
Next Story






