సాగర్ కాల్వలో పడి యువకుడు మృతి

by Sridhar Babu |

<p>దిశ, ముదిగొండ: నేలకొండపల్లి మండలం అనాసాగరం గ్రామ సమీపం వద్ద ఉన్న మంగాపురం మేజర్ కాలువలో పడి ఓ యువకుడు మృత్యువాత పడ్డారు. ముదిగొండ మండలం కమలాపురం గ్రామానికి చెందిన చింతకాయల గోపి(17)అనే యువకుడిగా స్థానికులు గుర్తించారు. అయితే బంధువుల పెళ్లి ఉండటంతో ఇంటికి రంగు వేయటం అయిపోయిన తరువాత నేలకొండపల్లి మండల కేంద్రానికి కొత్త బట్టలు కొనుక్కొని రావటానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో తన ఒంటికి పెయింట్ అంటి ఉండడంతో కాలువలో స్నానం చేసే [&hellip;]</p>

సాగర్ కాల్వలో పడి యువకుడు మృతి
X

దిశ, ముదిగొండ: నేలకొండపల్లి మండలం అనాసాగరం గ్రామ సమీపం వద్ద ఉన్న మంగాపురం మేజర్ కాలువలో పడి ఓ యువకుడు మృత్యువాత పడ్డారు. ముదిగొండ మండలం కమలాపురం గ్రామానికి చెందిన చింతకాయల గోపి(17)అనే యువకుడిగా స్థానికులు గుర్తించారు. అయితే బంధువుల పెళ్లి ఉండటంతో ఇంటికి రంగు వేయటం అయిపోయిన తరువాత నేలకొండపల్లి మండల కేంద్రానికి కొత్త బట్టలు కొనుక్కొని రావటానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో తన ఒంటికి పెయింట్ అంటి ఉండడంతో కాలువలో స్నానం చేసే క్రమంలో కాలువలో నీటి ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండి ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి మృతి చెందినట్టు స్థానికులు భావిస్తున్నారు. లేదా మరేదైనా కారణం ఉందా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై నేలకొండపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనితో కమలాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story