- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెరువులో పడి యువకుడు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, దుబ్బాక : ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఓ యువకుడు చెరువులో శవమై కనిపించిన సంఘటన పోతారెడ్డిపేట గ్రామంలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతరెడ్డిపేట గ్రామానికి చెందిన మంగి రాజు (19) అనే యువకుడు శుక్రవారం (నిన్న) నుండి కనిపించకుండా పోవడంతో అతని కోసం బంధువులు వెతకసాగారు. ఈ నేపథ్యంలోనే ఆ యువకుడు గ్రామ సమీపంలో గల చెరువులో శనివారం శవమై కనిపించడంతో బంధువులు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం […]</p>

X
దిశ, దుబ్బాక : ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఓ యువకుడు చెరువులో శవమై కనిపించిన సంఘటన పోతారెడ్డిపేట గ్రామంలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతరెడ్డిపేట గ్రామానికి చెందిన మంగి రాజు (19) అనే యువకుడు శుక్రవారం (నిన్న) నుండి కనిపించకుండా పోవడంతో అతని కోసం బంధువులు వెతకసాగారు. ఈ నేపథ్యంలోనే ఆ యువకుడు గ్రామ సమీపంలో గల చెరువులో శనివారం శవమై కనిపించడంతో బంధువులు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఎవరైనా హత్య చేసి చెరువులో పడేసి ఉంటారని ఆరోపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భూంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని చెరువులో నుండి తీసి శవ పంచనామా నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్యనా, ఆత్మహత్యనా అనే విషయాన్ని పోస్ట్ మార్ట్ రిపోర్ట్ ఆధారంగా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
Next Story






