- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్: వినాయకుడి మండపం వద్ద డాన్స్ చేస్తూ యువకుడు మృతి.. (వీడియో)
<p>దిశ, వెబ్‌డెస్క్: నిండా 20 ఏళ్లు కూడా లేవు.. సరదగా డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. స్నేహితులు అతన్ని పైకి లేపిచూస్తే అప్పటికే ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఈ విషాదఘటన అనంతపురం జిల్లా గుత్తిలో చోటు చేసుకుంది. వినాయకుడి మండపం వద్ద డాన్స్ చేస్తూ యువకుడు ఆకస్మాత్తుగా మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గుత్తి పట్టణం గౌతమిపురి కాలనీలో గణేష్ నవరాత్రోత్సవాల సందర్భంగా కాలనీవాసులు ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద సంబరాలు చేసుకుంటున్నారు. అందులో […]</p>

దిశ, వెబ్‌డెస్క్: నిండా 20 ఏళ్లు కూడా లేవు.. సరదగా డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. స్నేహితులు అతన్ని పైకి లేపిచూస్తే అప్పటికే ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఈ విషాదఘటన అనంతపురం జిల్లా గుత్తిలో చోటు చేసుకుంది. వినాయకుడి మండపం వద్ద డాన్స్ చేస్తూ యువకుడు ఆకస్మాత్తుగా మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గుత్తి పట్టణం గౌతమిపురి కాలనీలో గణేష్ నవరాత్రోత్సవాల సందర్భంగా కాలనీవాసులు ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద సంబరాలు చేసుకుంటున్నారు.
అందులో భాగంగా పుల్లయ్య అనే యువకుడు మండపం వద్ద డాన్స్ చేస్తూ సృహా తప్పి పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు సృహ తప్పిపడిపోయిన పుల్లయ్యను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పటివరకు తమతో పాటు ఉత్సాహంగా డాన్స్ చేసిన యువకుడు ఉన్నట్టుండి ఆకస్మాత్తుగా మృతి చెందడంతో కాలనీ వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






