- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరి కోపించడానికి వెళ్లిన యువకుడు అనంతలోకాలకు
by Shyam |
<p>దిశ, మద్దిరాల: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని రెడ్డిగూడెం గ్రామానికి చెందిన దగ్గుల లింగయ్య కుమారుడు సందీప్(20) ఉదయం వరి కోపించడానికి పొలం వద్దకు హార్వేస్టర్‌ను తీసుకెళుతున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ తీగలు అడ్డురావడంతో తప్పిస్తుండగా, ప్రమాదవశాత్తు అతనికి తీగలు తగిలాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురైన సందీప్ అక్కడికక్కడే మృతిచెందాడు. చేతికి […]</p>

X
దిశ, మద్దిరాల: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని రెడ్డిగూడెం గ్రామానికి చెందిన దగ్గుల లింగయ్య కుమారుడు సందీప్(20) ఉదయం వరి కోపించడానికి పొలం వద్దకు హార్వేస్టర్‌ను తీసుకెళుతున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ తీగలు అడ్డురావడంతో తప్పిస్తుండగా, ప్రమాదవశాత్తు అతనికి తీగలు తగిలాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురైన సందీప్ అక్కడికక్కడే మృతిచెందాడు. చేతికి అందివచ్చిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ నాగయ్య కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
Next Story






