- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం.. లిఫ్ట్‌లో ఇరుక్కొని యువకుడు మృతి
<p>దిశ, బంజారాహిల్స్: లిఫ్ట్‌లో ఇరుక్కొని ప్రమాదానికి గురై యువకుడు దుర్మరణం చెందిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా మొగ్గంపల్లి గ్రామ సమీపంలోని చున్నంబట్టి తండాకు చెందిన నేనావత్ శివాజీ గణేష్(29) గత రెండేళ్ళుగా బంజారాహిల్స్ రోడ్ నెం. 4లోని జీఎఎస్ హోటల్లో సూపర్వైజర్ గా పని చేస్తున్నాడు. గురువారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో లిఫ్ట్లో సాంకేతిక సమస్యలు తలెత్తి నాల్గో అంతస్తులో లిఫ్ట్ […]</p>

దిశ, బంజారాహిల్స్: లిఫ్ట్‌లో ఇరుక్కొని ప్రమాదానికి గురై యువకుడు దుర్మరణం చెందిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా మొగ్గంపల్లి గ్రామ సమీపంలోని చున్నంబట్టి తండాకు చెందిన నేనావత్ శివాజీ గణేష్(29) గత రెండేళ్ళుగా బంజారాహిల్స్ రోడ్ నెం. 4లోని జీఎఎస్ హోటల్లో సూపర్వైజర్ గా పని చేస్తున్నాడు. గురువారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో లిఫ్ట్లో సాంకేతిక సమస్యలు తలెత్తి నాల్గో అంతస్తులో లిఫ్ట్ నిలిచిపోవడంతో దాన్ని మరమ్మతు చేసేందుకు శివాజీ గణేష్, అక్కడే పని చేస్తున్న హౌజ్ కీపింగ్ సూపర్ వైజర్ ఆదర్శ్ కలిసి ప్రయత్నించారు.
ఈ క్రమంలో అదుపు తప్పి లిఫ్ట్లో శివాజీ ఇరుక్కుపోయాడు. పైకి లాగే క్రమంలో మరింత కిందికి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టంకు తరలించారు. ఘటనకు కారణమైన వ్యక్తుల నిర్లక్ష్యంపై కేసు నమోదు చేస్తామని బంజారాహిల్స్ సీఐ శివ చంద్ర తెలిపారు.






