డబుల్ బెడ్ రూమ్‌పై వీడియో.. యువకుడు ఆత్మహత్యాయత్నం

by  |
డబుల్ బెడ్ రూమ్‌పై వీడియో.. యువకుడు ఆత్మహత్యాయత్నం
X

దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ పట్టణ కేంద్రంకు చెందిన ఓ వ్యక్తి తనకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపికలో అన్యాయం జరిగిందని ఫేస్ బుక్‌లో వీడియోను అప్‌లోడ్ చేశాడు. అయితే వీడియో డిలీట్ చేయాలని కొంతమంది నాయకులు బెదిరించారని భయాందోళన చెంది పురుగుల మందు త్రాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సంఘటన జిల్లా కేంద్రంలో సంచలన రేకెత్తించింది.

ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన గోండ్రెల విజయ్ వృత్తి రీత్యా డ్రైవర్. తాను నిరుపేద కుటుంబానికి చెందిన వాడిని అని, ఉండడానికి ఇళ్లు కూడా లేదని పలుమార్లు ప్రజా ప్రతినిధులు, అధికారులకు విన్నవించుకున్నట్లు ఆరోపించారు. చేసేది ఏమి లేక తన ఆవేదనను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించాడు. విషయం తెలుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు ఆ వీడియోను డిలీట్ చేయాలని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయందోళన చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడినట్లు బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. చికిత్స నిమిత్తం వరంగల్ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు.


Next Story

Most Viewed