తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థి అధిక్యం

by  |
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థి అధిక్యం
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలవగా పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీ ముందుంది. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ నెల్లూరులోని డీకే ప్రభుత్వ మహిళ కళాశాలలోని 7 హళ్లలో , తిరుపతి వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో 10 హాళ్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఈ ఓట్ల ప్రక్రియ శరవేగంగా జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలవరకు అందిన సమాచారం మేరకు తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ఫలితాల్లో వైసీపీకి భారీ ఆధిక్యం లభించింది. వైసీపీ అధికార పార్టీకి చెందిన అభ్యర్థి గురుమూర్తీ 90 వేల పై చిలుకు ఓట్లతో అధిక్యంలో ఉన్నారు. వైసీపీ 2,04,370(56.1 శాతం), టీడీపీ1,17,612(32.3 శాతం), టీడీపీ 1,17,612(32.3 శాతం), సీపీఎం1,892(0.5 శాతం), కాంగ్రెస్ 3,280(0.9 శాతం) నోటా 4,950(1.4 శాతం) నమోదయ్యాయి. మొత్తం 25 రౌండ్లలో ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో కౌంటింగ్ ప్రకియను కొవిడ్ నిబంధనలను పాటిస్తూ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసుల బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.



Next Story