మహిళ మెడపై కత్తి పెట్టి ఆ పని చేసిన దుండగుడు

by  |

దిశ, ఉత్తరాంధ్ర : విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై దుండగుడు దాడికి పాల్పడి ఆమెపై బంగారాన్ని దోచుకెళ్లాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. దత్తిరాజేరు మండలం ముద్దానపేటలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ముద్దానపేట ఎంపీపీ స్కూల్‌లో మిడ్డే మీల్స్‌లో వంట చేస్తున్న చిన్నమ్మ గ్రామం నుంచి మానాపురం వైపు నడుచుకుంటూ వెళ్తుంది. మార్గమధ్యలో గుర్తు తెలియని దుండగుడు ఆమెను అడ్డగించి మెడపై కత్తి పెట్టాడు. ఆమె అతడిని తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో చిన్నమ్మ గొంతుకు తీవ్రగాయాలు అయ్యాయి. అయినా దుండగుడు ఆమె మెడలోని గొలుసు లాక్కోని పరారీ అయ్యాడు. స్థానికులు అప్రమత్తమై చిన్నమ్మను గజపతినగరం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మానాపురం పోలీసులు తెలిపారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed