విదేశీ ఉద్యోగం, వీసా పేరుతో మోసపోయారా..?

by Taduka Kalyani |   (  Updated:2026-06-04 13:25:25  IST  )

విదేశాల్లో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామని మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా అయితే మీరు ఆందోళనకు గురి కాకండి..పోలీసులకు ఫిర్యాదు చేయండని తెలంగాణ పోలీసులు కోరుతున్నారు.

విదేశీ ఉద్యోగం, వీసా పేరుతో మోసపోయారా..?
X

దిశ,సిటీ క్రైమ్ : విదేశాల్లో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామని మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా అయితే మీరు ఆందోళనకు గురి కాకండి..పోలీసులకు ఫిర్యాదు చేయండని తెలంగాణ పోలీసులు కోరుతున్నారు. ఇటీవల విదేశాల్లో భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని, వీసాలు ఇప్పిస్తామంటూ అమాయకులను మోసం చేస్తున్న సంఘటనలు జరుగుతున్నాయన్నారు. కొంత మంది యూట్యూబ్ ఇన్ ఫ్ల్యూయన్సర్ లు కూడా మోసాలు చేశారనే విషయాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మోసాలకు గురైన వారు వెంటనే స్థానిక పోలీసు స్టేషన్ లేదా సీసీఎస్ , ఈడీ, సీబీఐకి ఫిర్యాదు చేయాలని తెలంగాణ పోలీసులు కోరుతున్నారు. భారత ఇమ్మిగ్రేషన్ చట్టాలు, బీఎన్ఎస్ చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయన్నారు. ఈ చట్టాలతో మోసాలకు పాల్పడే వారికి 7 సంవత్సరాలు శిక్ష పడుతుందని పోలీసులు పేర్కొన్నారు. అదే విధంగా వారి ఆస్తులను కూడా జప్తు చేస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు తెలంగాణ పోలీసులు సోషల్ మీడియాలో అవగాహనకు సంబంధించిన పోస్టును ప్రచారం చేస్తున్నారు.

'నందూస్ వరల్డ్' కపుల్స్ కంత్రీ ప్లాన్ ఇదే.. యూకే కంపెనీలతో ఎలా బురిటీ కొట్టించారంటే?

Next Story