- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నక్సల్బరీలో అక్రమ సంబంధం.. వారిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని..
<p>దిశ, వెబ్‌డెస్క్ : అక్కడ, ఇక్కడ అని తేడా లేకుండా అక్రమ సంబంధాలు అంతటా కొనసాగుతున్నాయి. పల్లె నుంచి నగరం వరకు పరాయి సుఖం కోసం అర్రులు చాస్తున్నారు. కళ్లు మిరమిట్లు గొలిపే అందాల రాశి భార్యగా ఉన్నా.., కండలు తిరిగి కొండలను ఢీకొట్టే భర్త ఉన్నా మరో ‘పొందు’ కోసం ఆరాటపడుతున్నారు కొందరు ఆలుమగలు. అలాంటి వ్యక్తే ఇతగాడు. భార్యను ఇంట్లో ఉంచి ఎంచక్క తేయాకు తోటల్లో ప్రియురాలితో రోమాన్స్ చేస్తూ ఇల్లాలి ఆగ్రహానికి గురయ్యాడు. […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : అక్కడ, ఇక్కడ అని తేడా లేకుండా అక్రమ సంబంధాలు అంతటా కొనసాగుతున్నాయి. పల్లె నుంచి నగరం వరకు పరాయి సుఖం కోసం అర్రులు చాస్తున్నారు. కళ్లు మిరమిట్లు గొలిపే అందాల రాశి భార్యగా ఉన్నా.., కండలు తిరిగి కొండలను ఢీకొట్టే భర్త ఉన్నా మరో ‘పొందు’ కోసం ఆరాటపడుతున్నారు కొందరు ఆలుమగలు. అలాంటి వ్యక్తే ఇతగాడు. భార్యను ఇంట్లో ఉంచి ఎంచక్క తేయాకు తోటల్లో ప్రియురాలితో రోమాన్స్ చేస్తూ ఇల్లాలి ఆగ్రహానికి గురయ్యాడు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
డార్జిలింగ్ జిల్లాలోని నక్సల్బరీ ప్రాంతంలో సుదీప్త దాస్ తన భార్య రూపశ్రీ సర్కార్ దాస్‌తో కలిసి నివసిస్తున్నాడు. వీరికి ఓ కూతురు ఉంది. సుదీప్త దాస్ స్థానికంగా ఉన్న కిరణ్ చంద్ర టీ గార్డెన్‌లో హెడ్ క్లర్క్‌గా పని చేస్తున్నాడు. అన్యోన్యంగా సాగుతోన్న వారి సంసారంలోకి నక్సల్బరీ టీ గార్డెన్ ప్రాంతంలోని జాబ్రా సెక్షన్‌కు చెందిన సుజాత బారాక్ ఎంట్రీ ఇచ్చింది. ఆమెకు వివాహమై భర్త ఉన్నప్పటికీ సుదీప్త దాస్‌లో ఎఫైర్ పెట్టుకుంది. వీరిద్దరి అక్రమ సంబంధం కొద్ది రోజులు గుట్టుగా సాగినప్పటికీ.. ఆ తర్వాత అందరికీ తెలిసిపోయింది. ఈ విషయం తెలుసుకున్న సుదీప్త దాస్ భార్య రూపశ్రీ వారిద్దరికి తగిన గుణపాఠం చెప్పాలనుకుంది.
భర్త కొనసాగిస్తున్న కామక్రీడలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ఎదురు చూసిన భార్యకు దేవి నవరాత్రి ఉత్సవాలు కలిసి వచ్చాయి. ఈ క్రమంలో టీ గార్డన్ సమీపంలోని ఓ బెడ్ రూంలో వారిద్దరి రాసలీలల్లో మునిగి తేలుతున్నారని తెలుసుకున్న రూపశ్రీ నేరుగా భర్త ఉన్న బెడ్ రూంలోకి వెళ్లింది. లోకం మరిచి వ్యవహరిస్తోన్న వారిద్దరి బాగోతాన్ని బట్టబయలు చేసింది. అనంతరం బెడ్ పైనే ఉన్న వారిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. దట్టంగా మంటలు, పొగ వ్యాపించడంతో స్థానికులు వచ్చి సుదీప్త దాస్, సుజాతను ఆస్పత్రికి తరలించారు. అక్కడ సుజాత మృతిచెందగా.. సుదీప్త దాస్ పరిస్థితి విషమంగా ఉన్నది. రూపశ్రీపై సుజాత కుటుంబీకులు నక్సల్బరీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులను ఆమెను అరెస్ట్ చేసి సిలిగురి కోర్టులో హాజరు పరిచారు.






