- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్లుడికి అర్ధరాత్రి అతిగా మర్యాద.. ఆ చర్యతో ఒకరు మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్ : అల్లుడికి కూతురుకు మధ్య అప్పటికే గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య సఖ్యత లేక సంసారంలో కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో అల్లుడిని, కూతురుని ఇంటికి పిలిచిన అత్తామామలు అల్లుడికి అతిగా మర్యాదలు చేశారు. అదే వారు చేసిన పొరపాటు అయింది. క్షణికావేశంలో దాడి చేసుకోవడంతో ఒకరు మృతిచెందారు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో జరిగిందీ ఘటన. తాడేపల్లి మండలం నులకపేటకు చెందిన దుర్గారావు కొన్నాళ్ల క్రితం తన కూతురు లావణ్యను విజయవాడకు చెందిన […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : అల్లుడికి కూతురుకు మధ్య అప్పటికే గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య సఖ్యత లేక సంసారంలో కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో అల్లుడిని, కూతురుని ఇంటికి పిలిచిన అత్తామామలు అల్లుడికి అతిగా మర్యాదలు చేశారు. అదే వారు చేసిన పొరపాటు అయింది. క్షణికావేశంలో దాడి చేసుకోవడంతో ఒకరు మృతిచెందారు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో జరిగిందీ ఘటన.
తాడేపల్లి మండలం నులకపేటకు చెందిన దుర్గారావు కొన్నాళ్ల క్రితం తన కూతురు లావణ్యను విజయవాడకు చెందిన నరేష్ ఇచ్చి వివాహం చేశారు. కొద్దిరోజులు సవ్యంగానే సాగిన వీరి సంసారంలో ఇటీవల గొడవలు ప్రారంభమయ్యాయి. దీనిపై ఇరు కుటుంబ సభ్యులు ఇద్దరికి నచ్చచెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే నరేష్ పై కేసు నమోదు కావడంతో జైలుకు కూడా వెళ్లొచ్చాడు.
కాగా, బుధవారం అత్తగారింటికి నరేష్ తన భార్యతో కలిసి వచ్చాడు. బాధలో ఉన్న అల్లుడికి మర్యాదల్లో లోటు రాకూడదని ఏర్పాట్లు ఘనంగా చేశారు. అయితే సాయంత్రం నుంచి మందు తాగుతున్న నరేష్.. అత్తామామలతో జరిగిన డిస్కర్షన్ లో మాటామాటా పెరిగి తన భార్య లావణ్యపై దాడి దిగాడు. అల్లుడిని ఆపేందుకు అత్తామామలు ప్రయత్నించినా మద్యం మత్తులో ఉన్న అతడు ఆగలేదు. ఈ పెనుగులాటలో మామ దుర్గారావు ఇనుప రాడ్ తో అల్లుడిపై దాడి చేశారు. దీంతో నరేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. భార్య లావణ్య, అత్తామామలను అదుపులోకి తీసుకున్నారు.






