ఇసుక పెట్టిన చిచ్చు

by  |
ఇసుక పెట్టిన చిచ్చు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఇసుక అమ్మకంపై అన్నదమ్ముల మధ్య జరిగిన వాగ్వాదం దాడి చేసుకునే వరకు వెళ్ళింది. కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన శివంగుల లక్ష్మారెడ్డి, రాంరెడ్డిలు అన్నదమ్ములు. వీరికి గ్రామ శివారులో వాగు సమీపంలో వ్యవసాయ భూమి ఉంది. అయితే ఆ స్థలం పరిధిలో ఇసుక ఉంది. ఆ ఇసుకను ట్రాక్టర్లలో తీసుకెళ్లి అమ్ముకునే విషయంలో ఇసుక నాది అంటే నాది అని ఇద్దరిమధ్య వాగ్వాదం మొదలైంది. ఇద్దరి మధ్య ఇసుక విషయంలో మొదలైన వాగ్వాదం ఇరువురు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.అనంతరం ఇద్దరు వెళ్లి ఒకరిపై ఒకరు బిబీపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఇసుక గురించి కాదని, భూమి విషయంలో ఇద్దరికి గతంలో గొడవలు ఉన్నాయని, ప్రస్తుతం దాని విషయంలోనే గొడవ జరిగిందని కప్పిపుచ్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపనలు వినిపిస్తున్నాయి. ఇసుక కోసం దాడులు చేసుకున్న ఇద్దరు అన్నదమ్ములు కూడా అధికార టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుండగా లక్ష్మారెడ్డి గ్రామ ఎంపీటీసీగా ఉన్నారని సమాచారం.


Next Story