అఖిలప్రియపై ప్రారంభమైన విచారణ

42

దిశ, వెబ్‌డెస్క్: బోయినపల్లి కిడ్నాప్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులను కిడ్నాప్ చేశారన్న ఆరోపణల కారణంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అరెస్ట్ చేసి చంచల్ గూడ జైల్‌‌కు తరలించిన విషయం తెలిసిందే. మంగళవారం ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ బేగంపేట పోలీస్ స్టేషన్‌లో అఖిల ప్రియపై విచారణ ప్రారంభం అయింది. మూడు రోజుల కస్టడీలో భాగంగా రెండో రోజు ఆమెను పోలీసులు విచారిస్తున్నారు. కిడ్నాప్ వ్యవహారంలో భాగంగా అఖిల ప్రియను డీసీపీ కమలేశ్వర్ ప్రశ్నిస్తున్నారు.