శభాష్ పోలీస్.. ఆ పనిచేసినందుకు అభినందనలు..

by Sridhar Babu |   (  Updated:2021-11-03 05:44:36  IST  )

<p>దిశ, భద్రాచలం అర్బన్ : ట్రాఫిక్ పోలీసులు అనగానే నిబంధనలు పాటించని వాహనదారులకు ఫైన్ వేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిపై కేసులు పెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం, తగిన జరిమానా కట్టించడం లాంటివి మాత్రమే చూశాం. కానీ భద్రాచలంలో ట్రాఫిక్ పోలీసులు రహదారిపై ఏర్పడిన గోతులను పూడ్పించి ప్రజలచే శభాష్ అనిపించుకున్నారు. భద్రాచలం ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో భక్తుల రాకపోకలు, వాహనాల సంచారంతో రద్దీగా ఉంటుంది. దానికితోడు ఇక్కడి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, [&hellip;]</p>

శభాష్ పోలీస్.. ఆ పనిచేసినందుకు అభినందనలు..
X

దిశ, భద్రాచలం అర్బన్ : ట్రాఫిక్ పోలీసులు అనగానే నిబంధనలు పాటించని వాహనదారులకు ఫైన్ వేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిపై కేసులు పెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం, తగిన జరిమానా కట్టించడం లాంటివి మాత్రమే చూశాం. కానీ భద్రాచలంలో ట్రాఫిక్ పోలీసులు రహదారిపై ఏర్పడిన గోతులను పూడ్పించి ప్రజలచే శభాష్ అనిపించుకున్నారు. భద్రాచలం ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో భక్తుల రాకపోకలు, వాహనాల సంచారంతో రద్దీగా ఉంటుంది.

దానికితోడు ఇక్కడి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, ఆంధ్రాల నుంచి రోగులు వచ్చిపోతుంటారు. భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో వాహనాల రద్దీ వలన ప్రధాన రహదారి కుంగి గోతులు పడటంతో వాహనాదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.‌ ఈ సమస్యపై స్పందించిన భద్రాచలం ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతి భాస్కర్ బుధవారం దగ్గర ఉండి అంబేద్కర్ సెంటర్‌లో రహదారిపై గోతులు పూడ్పించి రోడ్డుకి మరమ్మతులు చేయించారు.

Next Story