పాత ఫోన్లతో తయారైన టోక్యో ఒలింపిక్స్ మెడల్స్..

by  |
medals
X

దిశ, ఫీచర్స్ : టోక్యో ఒలింపిక్స్-2020లో పాల్గొంటున్న చాలా మంది క్రీడాకారులకు ఇవే ఫస్ట్ ఒలింపిక్స్. కాగా ప్రేక్షకులు లేకుండా విశ్వక్రీడలు నిర్వహించడం కూడా ఇదే మొదటిసారి. అంతేకాదు ఈ ఒలింపిక్స్‌లో కొత్తగా మరిన్ని ఆటలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కానీ రీసైకిల్ చేసిన ఇ-వ్యర్థాల నుంచి ఒలింపిక్ పతకాలు తయారు చేశారనే విషయమే చాలా మందికి తెలియదు.

‘టోక్యో 2020 మెడల్ ప్రాజెక్ట్’గా మొదలైన ఇనిషియేటివ్‌లో భాగంగా 2017 ఏప్రిల్ నుంచి 2019 మార్చి వరకు 78,985 టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించారు. దాదాపు 2 సంవత్సరాలకు పైగా నిర్వహించిన డ్రైవ్‌లో.. జపాన్ వ్యాప్తంగా విద్యార్థులు, అథ్లెట్ల నుంచి ప్రైవేట్ కంపెనీల వరకు ప్రతీ ఒక్కరు వాడుకలో లేని చిన్న చిన్న ఎలక్ట్రానిక్ డివైస్‌లను డొనేట్ చేశారు. ఈ మేరకు మొత్తం 6.21 మిలియన్ సంఖ్యలో వాడేసిన ఫోన్లను కలెక్ట్ చేయగా.. వాటిని స్థానిక రీసైక్లింగ్ చట్టాల ప్రకారం వర్గీకరించి, డిస్‌మాంటిల్ చేశారు.

రిజల్ట్ ఏంటి?

దేశవ్యాప్తంగా కలెక్ట్ చేసిన ఈ-వేస్టేజ్ నుంచి 32 కిలోల బంగారం, 3,500 కిలోల వెండితో పాటు 2,250 కిలోల కాంస్యాన్ని వెలికితీశారు. వీటితో ఒలింపిక్, పారాలింపిక్ గేమ్స్ కోసం 5వేల మెడల్స్ తయారుచేశారు. ఈ పద్ధతుల్లో రూపొందించినప్పటికీ మెడల్స్ నాణ్యతలో ఎక్కడా రాజీపడలేదు. మెటాలిక్ పార్ట్స్ విషయంలోనే కాకుండా మెడల్స్‌కు వాడిన రిబ్బన్స్‌‌కు కూడా ఎకో-ఫ్రెండ్లీ పద్ధతులనే ఫాలో అయ్యారు. తయారీ ప్రక్రియలో తక్కువ కార్బన్ డయాక్సైడ్‌ను ఉత్పత్తిచేసే కెమికల్లీ రీసైకిల్డ్ పాలిస్టర్ ఫైబర్స్‌ను ఉపయోగించారు. ఇక 2019 ఒలింపిక్స్‌కు ప్రపంచవ్యాప్తంగా 53.6 మిలియన్ టన్నుల ఈ-వేస్ట్‌ను కలెక్ట్ చేయడం విశేషం.


Next Story

Most Viewed