తన పిల్లలు చనిపోతే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న పులి.. చివరికి ఇలా

by  |
తన పిల్లలు చనిపోతే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న పులి.. చివరికి ఇలా
X

దిశ,వెబ్‌డెస్క్: పేదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ.. కదిలే దేవత అమ్మ.. కంటికి వెలుగమ్మా అంటూ ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ గొప్ప తనం గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మా అనే ఆ రెండక్షరాల్లో అంత కమ్మదనం ఉంటుందంటే అతిశయోక్తి లేదు. ఎక్కడనైనా స్వార్థం ఉంటుందేమో కానీ అమ్మ ప్రేమలో స్వార్థానికి తావులేదు. అమ్మ ప్రేమంటే ఆకాశమంత.

అలాంటి త‌ల్లి ప్రేమ‌ను , గొప్పతనాన్ని గుర్తుచేసింది ఓ ఆడ పులి. ఓ జూలో ఉండే ఆడ‌పులి నెలలు నిండకముందే ఐదు పులి పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ప్రీ మెచ్యూర్ కార‌ణంగా ఆ ఐదు పులి పిల్లలు మ‌ర‌ణించాయి. దీంతో ఆ పిల్లలకు త‌ల్లైన పులి డిప్రెష‌న్ కు గురైంది. తిండి తినకుండా, నిద్ర పోకుండా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. రోజులు గడుస్తున్నాయి. పులిలో ఆలోచనలో ఎలాంటి మార్పు రాలేదని గమనించిన జూ సిబ్బంది.. పులిని తాను ఆత్మహత్య చేసుకునేందుకు కారణమైన బాధను దూరం చేయాలని అనుకున్నారు. అలా చేయకపోతే మరణించించిన జూ సిబ్బంది ఓ ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ సూప‌ర్ హిట్ అయ్యింది. ఇంతకీ ఆ ప్లాన్ ఏంట‌ని అనుకుంటున్నారా ? ఐదు చిన్నసైజు పందిపిల్లకు పులి చ‌ర్మంతో త‌యారు చేసిన డ్రెస్ కుట్టి త‌ల్లైన పులి దగ్గర ప‌డుకోబెట్టారు. అంతే ఇదిగో ఇలా పంది పిల్లలే త‌న నిజ‌మైన పిల్లలని అనుకుంటుంది. అంతేకాదు పంది పిల్లల్ని వదిలి పెట్టడం లేదు. అవి తన నిజమైన పులి పిల్లలు కాదని, పంది పిల్లలే అని తెలిసినా సరే వాటిపై తల్లి ప్రేమను కురిపిస్తోంది.

Next Story

Most Viewed