- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అర్ధరాత్రి ఏటీఎంలో ఆ పనిచేసిన ఆగంతకులు.. దానికోసమేనా..?
<p>దిశ, మహబూబాబాద్ టౌన్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పటల్ సమీపంలో గల ఏటీఎంలో అగ్ని ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని దుండగులు మంగళవారం అర్ధరాత్రి ఏటీఎం మెషిన్ కి నిప్పుపెట్టి పరారయ్యారు. ఈ ప్రమాదంలో ఏటీఎం మెషిన్ పూర్తిగా దగ్దమైంది. మంటలను గమనించిన ఇంటి యజమాని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ముంబైలోని యాక్సిస్ బ్యాంకు కంట్రోల్ రూమ్ నుంచి మహబూబాబాద్ పట్టణ పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అగ్నిమాపక […]</p>

దిశ, మహబూబాబాద్ టౌన్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పటల్ సమీపంలో గల ఏటీఎంలో అగ్ని ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని దుండగులు మంగళవారం అర్ధరాత్రి ఏటీఎం మెషిన్ కి నిప్పుపెట్టి పరారయ్యారు. ఈ ప్రమాదంలో ఏటీఎం మెషిన్ పూర్తిగా దగ్దమైంది. మంటలను గమనించిన ఇంటి యజమాని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ముంబైలోని యాక్సిస్ బ్యాంకు కంట్రోల్ రూమ్ నుంచి మహబూబాబాద్ పట్టణ పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది, విద్యుత్ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ఆగంతుకులను పట్టుకునేందుకు పోలీసులు సంఘటనా స్థలం సమీపంలోని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఆగంతకులు ఏటీఎంలో చోరీ చేసేందుకు ప్రయత్నించి విఫలం కావడంతో ఏటీఎం దగ్ధం చేశారా..? మరేదైనా కారణమా..? అనేది పోలీసుల విచారణలో తెలియాల్సిఉంది.






