- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చరణ్ హెల్త్ కండిషన్‌పై స్పందించిన టీమ్.. షూటింగ్ ఆగిపోవడంపై క్లారిటీ ఇవ్వడంతో నెటిజన్ల రియాక్షన్ ఇదే
చరణ్ గారి కంటికి ఏమీ కాలేదు. దెబ్బ కంటి పైన (కనుబొమ్మ పక్కన) తగిలింది. దానికి నాలుగు కుట్లు పడ్డాయి.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు గత కొద్ది గంటలుగా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi) షూటింగ్‌లో ఆయన గాయపడ్డారనే వార్త నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా చరణ్ కంటికి దెబ్బ తగిలిందని ప్రచారం జరగడంతో మెగా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. చరణ్ గాయం నుంచి త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. ఈక్రమంలో.. తాజాగా, ఈ విషయంపై చరణ్ టీమ్ స్పందించి అసలు నిజం వెల్లడించింది. "చరణ్ గారి కంటికి ఏమీ కాలేదు. దెబ్బ కంటి పైన (కనుబొమ్మ పక్కన) తగిలింది. దానికి నాలుగు కుట్లు పడ్డాయి. కన్ను మాత్రం చాలా క్షేమంగా ఉంది. ఎవరూ భయపడాల్సిన పనిలేదు" అని స్పష్టం చేశారు. సాధారణంగా ఇలాంటి గాయాలైనప్పుడు హీరోలు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటారు.
కానీ రామ్ చరణ్ మాత్రం తన డెడికేషన్‌ను చాటుకున్నారు. అది చిన్న గాయమే అని కొట్టిపారేస్తూ, షూటింగ్‌కు ఎక్కడా బ్రేక్ ఇవ్వకుండా బుధవారం కూడా సెట్స్‌కు హాజరయ్యారని తెలిపారు. షూటింగ్ షెడ్యూల్ పాడవకూడదనే ఉద్దేశంతో ఆయన వెంటనే పనిలో నిమగ్నమవ్వడం చూసి మూవీ టీమ్ ఆశ్చర్యపోయినట్లు వివరించారు. దీంతో రామ్ చరణ్ అభిమానులు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. అలాగే ఆయన డెడికేషన్ చూసి ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కాగా.. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమా మార్చి 27న విడుదల కావాల్సి ఉంది. కానీ బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, బాలీవుడ్ మూవీ ‘ధురంధర్ 2’ వంటి భారీ చిత్రాలతో పోటీ పడకుండా ‘పెద్ది’ విడుదలను ఏప్రిల్ 30కి వాయిదా వేశారు.






