- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించిన సుప్రీంకోర్టు
<p>దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తరపు న్యాయవాది దుశ్యంత్ దవే తెలియజేశారు. శుక్రవారం సుప్రీంకోర్టులో సీబీఎస్‌ఈ పరీక్షల రద్దు అంశంపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ పరీక్షల రద్దు విషయాన్ని ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సుప్రంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించింది. గురువారం సుప్రీం విచారణ అనంతరం సీఎం వైఎస్ […]</p>

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తరపు న్యాయవాది దుశ్యంత్ దవే తెలియజేశారు. శుక్రవారం సుప్రీంకోర్టులో సీబీఎస్‌ఈ పరీక్షల రద్దు అంశంపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ పరీక్షల రద్దు విషయాన్ని ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సుప్రంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించింది.
గురువారం సుప్రీం విచారణ అనంతరం సీఎం వైఎస్ జగన్ మంత్రులు ఉన్నతాధికారులతో చర్చించి వెంటనే పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకున్నారని దవే తెలిపారు. పరీక్షల నిర్వహణకు సిద్ధమైనప్పటికి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను రద్దు చేసినట్లు తెలిపారు. పది రోజుల్లో హైపవర్ కమిటీ అసెస్‌మెంట్ స్కీమ్‌ను రూపొందించి జూలై 31 లోపు ఫలితాలను ప్రకటిస్తుందని ధర్మాసనానికి దవే వివరణ ఇచ్చారు.






