పార్టీకి బలం, బలగం కార్యకర్తలే : జిల్లా పిసిసి పరిశీలకులు కుచన రవళిరెడ్డి

by Bhanu |   (  Updated:2025-05-15 13:52:21  IST  )

పార్టీకి బలం బలగం గట్టి పునాది కార్యకర్తలే అని మహబూబాబాద్ జిల్లా పిసిసి పరిశీలకులు కుచన రవళిరెడ్డి అన్నారు. గురువారం పిసిసి పరిశీలకులు రవళిరెడ్డితో కలిసి కొత్తగూడ, గంగారం మండలాల్లో కార్యకర్తలు,నాయకులతో సమావేశమయ్యారు.

పార్టీకి బలం, బలగం కార్యకర్తలే : జిల్లా పిసిసి పరిశీలకులు కుచన రవళిరెడ్డి
X

దిశ, కొత్తగూడ : పార్టీకి బలం బలగం గట్టి పునాది కార్యకర్తలే అని మహబూబాబాద్ జిల్లా పిసిసి పరిశీలకులు కుచన రవళిరెడ్డి అన్నారు. గురువారం పిసిసి పరిశీలకులు రవళిరెడ్డితో కలిసి కొత్తగూడ, గంగారం మండలాల్లో కార్యకర్తలు,నాయకులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎంపికలకు సంబంధించిన ఆశావాహుల దరఖాస్తులను స్వీకరించారు.ఈ సందర్భంగా కుచన రవళి రెడ్డి మాట్లాడుతూ..కష్టాల్లో కాంగ్రెస్ వెన్నంటి నడిచిన కార్యకర్తలే పార్టీకి బలం అంటూ పార్టీని నమ్ముకొని పని చేసిన నాయకులకు కార్యకర్తలకు పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఏ విధంగా కష్టపడ్డారో, అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కష్టపడి పని చేసి 100 శాతం స్థానాలను కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

కొత్తగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడి బరిలో సల్మాన్..

కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సంస్థగత ఎన్నికలలో కొత్తగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సల్మాన్ పాషా కు అవకాశం కల్పించాలని కోరుతూ నేడు మండల కేంద్రం లో నిర్వహించిన పార్టీ సంస్థాగత కార్యక్రమంలో జిల్లా పరిశీలకులు అయిన రవళి రెడ్డి లకు సల్మాన్ నామినేషన్ పత్రాన్ని అందజేశారు.సల్మాన్ 2004 నుండి 2008 వరకు ఉమ్మడి కొత్తగూడ మండలానికి ఎన్ ఎస్ యూ ఐ మండల అధ్యక్షుడిగా పనిచేసినట్లు, 2009 నుండి 2012 వరకు యూత్ కాంగ్రెస్ ములుగు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎన్నికైనట్లు ,మరియు 2014 నుండి 2016 వరకు యూత్ కాంగ్రెస్ ములుగు నియోజకవర్గ అధ్యక్షుడిగా పని చేసి నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేసినట్లుగా మారిన రాజకీయ పరిణామాలకు దీటుగా కాంగ్రెస్ పార్టీ కి అనుబంధగానే ఉంటూ పార్టీ లో క్రియాశీలం గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.పార్టీ కి విదేయుడిగా ఉంటూ ఒక జర్నలిస్ట్ యూనియన్ కు అధ్యక్షుడిగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు...ప్రస్తుతం పార్టీ నిర్వహిస్తున్న సంస్థగత ఎన్నికలలో భాగంగా తన నామినేషన్ ను పార్టీ పరిగణనలోకి తీసుకుని,అవకాశం ఇస్తే ఎల్లపుడూ పార్టీ కి కట్టుబడి ఉంటానని అన్నారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




Next Story