- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఆర్ఎస్ నాయకులకు సిగ్గుండాలి: రామ్ కిషోర్
by Shyam |
<p>దిశ, వాజేడు: దేశ ప్రధాని దిష్టి బొమ్మ దహనం చేయడానికి తెరాస పార్టీ నాయకులకు సిగ్గుండాలని బీజేపీ మండల అధ్యక్షుడు కందుల రామ్ కిషోర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు బస్తాలు, హమాలీ చార్జీలు, లారీ కిరాయి, రైతులకు కనీస మద్దతు ధర కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని అన్నారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వమే జాప్యం చేస్తూ, రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. అయినా సిగ్గు లేకుండా కేంద్ర ప్రభుత్వాన్ని […]</p>

X
దిశ, వాజేడు: దేశ ప్రధాని దిష్టి బొమ్మ దహనం చేయడానికి తెరాస పార్టీ నాయకులకు సిగ్గుండాలని బీజేపీ మండల అధ్యక్షుడు కందుల రామ్ కిషోర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు బస్తాలు, హమాలీ చార్జీలు, లారీ కిరాయి, రైతులకు కనీస మద్దతు ధర కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని అన్నారు.
ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వమే జాప్యం చేస్తూ, రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. అయినా సిగ్గు లేకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ ను ఏవిధంగా అయితే తరిమారో అదేవిధంగా అన్ని నియోజకవర్గాలలో ప్రజలు భారతీయ జనతా పార్టీ పక్షాన ఉండి, అధికార పార్టీ మెడలు వంచి, తగిన బుద్ధి చెబుతారన్నారు.
Next Story






