హన్సికకు అదిరిపోయే బహుమతి

by  |
హన్సికకు అదిరిపోయే బహుమతి
X

బాలనటిగా గుర్తింపు.. ఎన్నో అవార్డులు, రివార్డులు.. 15 ఏళ్లకే హీరోయిన్‌గా ఎంట్రీ.. 20 ఏళ్లకే స్టార్ హీరోయిన్ రేంజ్.. అభిమాన తారగా వెలుగొందుతూ గుడిలో దేవతగా పూజలందుకున్న అదృష్టం.. ఇదంతా ఎవరి గురించో ఇప్పటికే అర్థమై ఉంటుంది. అవును.. మిల్క్ షేక్ లాంటి అందాలతో కుర్రకారు మతిపోగొట్టే హన్సిక మెుత్వాని గురించే.

‘దేశ ముదురు’ సినిమాతో హీరోయిన్‌‌గా పరిచయమైన హన్సిక.. లేలేత అందాలతో కుర్రకారుని ఫిదా చేసేసింది. వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోయిన భామ.. నార్త్ నుంచి వచ్చినా సౌత్‌లో స్టార్ రేంజ్ దక్కించుకుంది. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ స్టార్స్ అందరితోనూ నటించిన హన్సిక.. తన అందం, అభినయంతో ఫుల్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఏకంగా తనకు గుడి కూడా కట్టేశారంటే.. ఎంతటి గొప్ప అభిమానులున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఆగస్ట్ 9న పుట్టినరోజు జరుపుకుంటున్న హన్సికకు సోషల్ మీడియా వేదికగా ఇటు తోటి నటీనటులు, అటు అభిమానులు బెస్ట్ విషెస్ అందిస్తున్నారు. అంతేకాదు కుటుంబ సభ్యులు, స్నేహితులు తనకు జీవితంలో మరిచిపోలేని బహుమతిని అందించారు. ఏకంగా ఆకాశంలో ఉన్న తారకు.. ఈ తార పేరు పెట్టేశారు. హన్సిక మొత్వాని పేరు మీద స్టార్‌ను రిజిస్టర్ చేయించి.. ఆ స్టార్‌ను ఈ స్టార్‌కు గిఫ్ట్‌‌గా ఇచ్చారు.

దీంతో చాలా ఆనందపడి పోయిన హన్సిక.. ఇంత గొప్ప కుటుంబాన్ని, మిత్రులను ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు తెలిపింది. తను ఆకాశంలోని నక్షత్రాలను ఇష్టపడుతున్నానని తెలిసి.. ఆ నక్షత్రాన్ని తనకు బహుమతిగా ఇస్తారని అనుకోలేదని.. ఇంత కన్నా గొప్ప పుట్టినరోజు ఉండదేమో అంటూ సంతోషం వ్యక్తం చేసింది బర్త్ డే గర్ల్.

https://www.instagram.com/p/CDqG_F5HQzA/?igshid=zi8yfpifzeuw


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed