- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బొబ్బిలి, పార్వతీపురం మధ్య నిలిచిన రాకపోకలు
by Vemula.Srinu Prasad |
<p>విజయనగరం జిల్లాలోని ప్రధాన మండలాలైన బొబ్బిలి, పార్వతీపురం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కరోనా కష్టకాలంలో ప్రజలపై పగబట్టినట్టు గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలోని ఈ రెండు మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా, పని వాళ్లు దొరకక, ఒకరిద్దరే వ్యవసాయ పనులు చేసుకుంటున్న వేళ.. కురుస్తున్న వర్షాలకు సీతానగరం మండలంలోని స్వర్ణముఖి నదిపై నిర్మించిన వంతెనకు మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక రహదారి నిర్మించారు. వరుసగా కురుస్తున్న […]</p>

X
విజయనగరం జిల్లాలోని ప్రధాన మండలాలైన బొబ్బిలి, పార్వతీపురం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కరోనా కష్టకాలంలో ప్రజలపై పగబట్టినట్టు గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలోని ఈ రెండు మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా, పని వాళ్లు దొరకక, ఒకరిద్దరే వ్యవసాయ పనులు చేసుకుంటున్న వేళ.. కురుస్తున్న వర్షాలకు సీతానగరం మండలంలోని స్వర్ణముఖి నదిపై నిర్మించిన వంతెనకు మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక రహదారి నిర్మించారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు ఇది కొతకు గురై కొట్టుకుపోయింది. దీంతో 36వ రహదారిపై రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. ఈ రెండు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Tags: rains, vijayanagaram district, bobbili, parvathipuram, transport stuck
Next Story






