స్పైస్ జెట్‌కు తప్పిన ప్రమాదం

by  |
స్పైస్ జెట్‌కు తప్పిన ప్రమాదం
X

న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ విమానానికి త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. సాధారణం కంటే 1000 అడుగుల తక్కువ ఎత్తులో పైలెట్ ల్యాండింగ్‌కు ప్రయత్నించడంతో ప్రవేశ మార్గంలోని లైట్లు, విమానం టైర్ ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు, నలుగురు సిబ్బంది సహా 155 మంది ప్రయాణికులు ఉన్నారు. బెంగళూరు నుంచి బయల్దేరిన స్పైస్‌జెట్ బోయింగ్ 737-800 విమానం గువాహటి విమానాశ్రయంలో ల్యాండింగ్‌ కోసం పైలెట్ సంప్రదించగా సిబ్బంది రన్ వే -2ను సిద్ధం చేశారు.

మేఘాలు కమ్ముకుని ఉండటంతో పైలెట్ ఎత్తు అంచనా వేయడంలో విఫలమై తక్కువ ఎత్తులో ల్యాండింగ్‌కు ప్రయత్నించాడు. దీంతో ప్రవేశ మార్గంలో లైట్లు ధ్వంసం కావడంతోపాటు విమానం హార్డ్ ల్యాండింగ్ అయింది. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని డీజీసీఏ తెలిపింది.


Next Story

Most Viewed