తండ్రిని కొట్టిచంపిన కొడుకు.. ఎందుకో తెలుసా?

258
murder

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన తండ్రిని కుమారుడు కర్రతో కొట్టిచంపాడు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… కోదాడ పట్టణంలో గుడిబండ రోడ్‌లో లారీ డ్రైవర్ సైదులు(45) కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. అయితే.. సైదులు రోజూ తాగి ఇంటికొచ్చి భార్యతో గొడవ పడడం ప్రారంభించారు. నిత్యం తల్లిని కొడుతూ చిత్రహింసలకు గురిచేస్తుండటంతో భరించలేక చిన్నకుమారుడు చందు కోపంతో తండ్రి తలపై కర్రతో గట్టిగా కొట్టాడు. దీంతో సైదులుకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆందోళనతో కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సైదులు మృతిచెందాడు. పెద్ద కుమారుడు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన సీఐ నరసింహరావు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..